Sunny: బిగ్ బాస్ సీజన్-5 విజేత సన్నీ

Sunny emerges as Bigg Boss season five winner
  • ముగిసిన బిగ్ బాస్ ఐదో సీజన్
  • టైటిల్ నెగ్గిన సన్నీ
  • రన్నరప్ గా షణ్ముఖ్
  • సన్నీకి రూ.50 లక్షల నగదు, ఓ ప్లాట్, బైకు

గత 105 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉర్రూతలూగించిన బిగ్ బాస్ సీజన్-5లో బుల్లితెర నటుడు సన్నీ విజేతగా అవతరించాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్ గా నిలిచాడు. విజేతగా నిలిచిన సన్నీకి రూ.50 లక్షల నగదు, సువర్ణభూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ నుంచి రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్, టీవీఎస్ బైకు లభించాయి.

కాగా, విజేతగా తన పేరు ప్రకటించగానే సన్నీ ఆనందం అంతాఇంతా కాదు. హోస్ట్ నాగార్జునను పైకెత్తి తన సంతోషాన్ని వెలిబుచ్చాడు. వేదికపై గెంతుతూ కేరింతలు కొట్టాడు. సన్నీ ప్రస్థానం ఆసక్తికరం అని చెప్పాలి. మొదట పాత్రికేయుడిగా పనిచేసిన సన్నీ ఆ తర్వాత టెలివిజన్ రంగంలో ప్రవేశించి వీజేగా అలరించాడు. అటు తర్వాత సీరియల్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు.

  • Loading...

More Telugu News