Andhra Pradesh: ఏపీలో కొత్తగా 121 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Status Report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 29,643 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 121 మందికి కరోనా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 20, విశాఖ జిల్లాలో 13, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 228 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,804 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,59,728 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,597 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,479కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Today Cases
Update

More Telugu News