ఆ జూనియర్ మంత్రికి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవు: కేటీఆర్
- ఆర్మీ పరిధిలో కంటోన్మెంట్ ఏరియా
- కంటోన్మెంట్ పరిస్థితిపై కేటీఆర్ ట్వీట్
- రోడ్లను ఇష్టానుసారం మూసివేస్తున్నారని ఆరోపణ
- కేంద్రం ఎందుకు అడ్డుకోవడంలేదన్న కేటీఆర్
- కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో కలిపేయాలని విజ్ఞప్తి
మీ జూనియర్ మంత్రి (కిషన్ రెడ్డి)కి కంటోన్మెంట్ లో ఉండే క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవు అంటూ రాజ్ నాథ్ కు తెలిపారు. కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వెల్లడించారు. ఈ చర్యలను కేంద్రం ఎందుకు అడ్డుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కంటోన్మెంట్ బోర్డు తగు చర్యలు తీసుకోలేకపోతే, కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని సూచించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.