పెళ్లి ఆలస్యమైతే ఆడపిల్లలు తిరుగుబోతులు ఎందుకవుతారు?: ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
- అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచబోతున్న కేంద్రం
- ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
- కేంద్రం నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్న పలువురు విపక్ష నేతలు
మరోవైపు కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. 21 ఏళ్లకు ఆడపిల్లలకు పెళ్లి చేస్తే వారు తిరుగుబోతులుగా మారతారని కొందరు అంటున్నారని... వాళ్లెందుకు తిరుగుబోతులవుతారని ప్రశ్నించారు. అమ్మాయిలపై మీకు నమ్మకం లేదా? అని అడిగారు. 'ఇది హిందుస్థానీ మైండ్ సెట్ కాదని, తాలిబానీ మైండ్ సెట్' అని మంత్రి అన్నారు.