Brijbhushan Sharan Singh: యువ రెజ్లర్ పై చేయి చేసుకున్న బీజేపీ ఎంపీ... వీడియో ఇదిగో!

BJP MP Brijbhushan slaps wrestler
  • ఝార్ఖండ్ లో ఘటన
  • రాంచీలో జాతీయ అండర్-15 రెజ్లింగ్ పోటీలు
  • చీఫ్ గెస్టుగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ 
  • తనకు ఆడే అవకాశం ఇవ్వాలని ఎంపీని కోరిన రెజ్లర్
  • అసహనంతో విరుచుకుపడిన ఎంపీ

ఓ బీజేపీ ఎంపీ యువ రెజ్లర్ చెంప చెళ్లుమనిపించిన ఘటన అందరినీ నివ్వెరపరిచింది. ఈ ఘటన ఝార్ఖండ్ లో జరిగింది. రాంచీ నగరంలో జాతీయ అండర్-15 రెజ్లింగ్ చాంపియన్ షిప్ నిర్వహిస్తున్నారు. తొలిరోజు పోటీలకు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చీఫ్ గెస్టుగా విచ్చేశారు. ఆయన భారత రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడు.

ఇక పోటీలు జరుగుతుండగా ఓ యువ రెజ్లర్ ఎంపీ బ్రిజ్ భూషణ్ వద్దకు వచ్చాడు. తనకు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని పదేపదే విజ్ఞప్తి చేశాడు. వాస్తవానికి అక్కడ జరుగుతున్నది అండర్-15 ఈవెంట్ కాగా, ఎంపీ వద్దకు వచ్చిన కుర్రాడికి వయసు పరిమితి దాటిపోయింది. దాంతో అతడ్ని నిర్వాహకులు అనర్హుడిగా పేర్కొన్నారు.

అయినప్పటికీ తనకు పోటీపడే అవకాశం ఇవ్వాలని ఎంపీని కోరాడు. ఎంపీ చెప్పేది వినిపించుకోకుండా, తనకు ఆడే అవకాశం కల్పించాలంటూ అదేపనిగా కోరాడు. దాంతో ఒళ్లుమండిన ఎంపీ... ఆ రెజ్లర్ చెంప చెళ్లుమనిపించారు. అనంతరం అతనిని అక్కడి నుంచి నెట్టివేశారు. అంతలో అక్కడున్న వారు ఎంపీకి సర్దిచెప్పి, ఆ కుర్రాడ్ని పంపించివేశారు.

ఇతర పార్టీల ఎంపీలు బీజేపీ ఎంపీ తీరును ప్రశ్నిస్తున్నారు. నెటిజన్లు ఎంపీ ప్రవర్తనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. యువ రెజ్లర్లకు ఇలా వేదికపైనే ట్రైనింగ్ ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News