Rakul Preet Singh: దర్శకులెవరూ నాకు అలాంటి షరతులు విధించలేదు: రకుల్ ప్రీత్ సింగ్

Intentionally we should not gain or loose weight says Rakul Preet Singh
  • కావాలని బరువు తగ్గడం, పెరగడం చేయకూడదు
  • అది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది
  • బరువు విషయంలో దర్శకులు నాకు షరతులు విధించలేదు
సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ కు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తుందో అందరికీ తెలుసు. తన అభిరుచికి తగ్గట్టుగానే ఆమె ఫిట్ నెస్ బిజినెస్ లోకి కూడా దిగింది. జిమ్ లు ఏర్పాటు చేసింది. మరోవైపు పాత్రలకు తగ్గట్టుగా హీరోయిన్లు బరువు తగ్గడం, పెరగడం వంటివి చేస్తుంటారు. అయితే అలాంటి తప్పు తాను ఎప్పటికీ చేయబోనని రకుల్ తెలిపింది.

ఇక ఛాలెంజింగ్ పాత్రలంటే తనకు చాలా ఇష్టమని... ఆ పాత్రలకు జీవం పోసేందుకు ఎంతో కష్టపడతానని చెప్పింది. అయితే బరువు తగ్గడం, పెరగడం తన వల్ల కాదని తెలిపింది. శరీర బరువులో మార్పు అనేది సహజంగా జరగాల్సిన ప్రక్రియ అని... కావాలని బరువు పెరగడమో లేదా తగ్గడమో చేస్తే దాని ప్రభావం శరీరంపై తీవ్రంగా పడుతుందని చెప్పింది. అది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని తెలిపింది. తన అదృష్టం కొద్దీ దర్శకులెవరూ బరువు విషయంలో తనకు షరతులు విధించలేదని చెప్పింది.
Rakul Preet Singh
Tollywood
Weight

More Telugu News