WHO: సీరం కోవావ్యాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతి

WHO gives approval to Novavax Serum Institutes Covavax  vaccine
  • కరోనాపై పోరులో మరో టీకా అందుబాటులోకి
  • భారత్‌లో వినియోగానికి డీసీజీఐ అనుమతులు తప్పనిసరి
  • వైరస్‌పై అద్భుతంగా పనిచేస్తోందన్న సీరం సీఈవో
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేసిన పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరో టీకాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ తాజాగా తీసుకొచ్చిన కొవావ్యాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ‌హెచ్ఓ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది.

అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ నుంచి లైసెన్స్ పొందిన సీరం సంస్థ ఈ టీకాను ఉత్పత్తి చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ అనుమతులపై సీరం సీఈవో అదర్ పూనావాలా స్పందిస్తూ.. కరోనాపై పోరుకు మరో టీకా అందుబాటులోకి వచ్చినట్టు చెప్పారు. వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ టీకా అద్భుతంగా పనిచేస్తున్నట్టు చెప్పారు.

తాజా వ్యాక్సిన్ కోవావ్యాక్స్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతులు లభించినప్పటికీ మన దేశంలో వినియోగానికి మాత్రం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి తప్పనిసరి. త్వరలోనే దీని నుంచి అనుమతులు లభిస్తాయని సీరం ఆశాభావం వ్యక్తం చేసింది.
WHO
Novavax
Serum Institute
COVID19
Vaccine
Covavax

More Telugu News