Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్

  • రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై తీర్పును వెలువరించిన ట్రైబ్యునల్
  • కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశం
  • నిర్మాణాలు చేపడితే ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక
NGT gives shock to AP Govt in Rayalaseema Lift project

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సంబంధించి ఈరోజు ట్రైబ్యునల్ తన తీర్పును వెలువరించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా పనులను చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ ఆదేశాలను కాదని నిర్మాణాలను చేపడితే ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధ్యయనం కోసం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఏపీ చీఫ్ సెక్రటరీపై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదని చెప్పింది.

More Telugu News