COVID19: తెలంగాణలో కొత్తగా 190 మందికి కరోనా పాజిటివ్

Few more Covid positive cases emerges in Telangana
  • గత 24 గంటల్లో 40,103 కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,805 మందికి చికిత్స
తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 40,103 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 కొత్త కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13, హన్మకొండ జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 195 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,064 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,71,247 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,805 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,012కి పెరిగింది.
COVID19
Positive Cases
Telangana
Today Cases

More Telugu News