Sukumar: 'పుష్ప'లో సరికొత్త అల్లు అర్జున్ ను చూస్తారు: సుకుమార్

Sukumar says new Allu Arjun will be seen in Pushpa for sure
  • డిసెంబరు 17న 'పుష్ప' రిలీజ్
  • మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు బన్నీ కొత్త సినిమా
  • హైదరాబాదులో చిత్ర బృందం ప్రెస్ మీట్
  • అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ కూడా హాజరు
మరికొన్ని గంటల్లో 'పుష్ప' చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రబృందం విస్తృతంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించింది. హైదరాబాదులో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు సుకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో సరికొత్త అల్లు అర్జున్ ను చూస్తారని వెల్లడించారు. ఇందులో సునీల్ మెయిన్ విలన్ గా కనిపిస్తాడని, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఓ సర్ ప్రైజ్ ప్యాకేజ్ అని పేర్కొన్నారు. పుష్ప సెకండ్ పార్ట్ లోనూ ఫహాద్ పాత్ర కొనసాగుతుందని వివరించారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఇలాంటి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తప్ప మరెవ్వరూ నిర్మించలేరంటూ నిర్మాతలు రవి, నవీన్, చెర్రీలకు కితాబునిచ్చారు. దర్శకుడు సుకుమార్ గురించి చెబుతూ, పుష్ప చూసినవారు కమర్షియల్ సినిమాలను ఇలా కూడా తీయొచ్చా అని ఆశ్చర్యపోవడం ఖాయమని బన్నీ పేర్కొన్నారు.
Sukumar
Allu Arjun
Pushpa
Tollywood

More Telugu News