Shilpa Chowdary: సెలబ్రిటీలకు టోకరా వేసిన కేసులో శిల్పా చౌదరికి బెయిల్

Shilpa Chowdary gets bail
  • పెట్టుబడుల పేరుతో పలువురి నుంచి కోట్లు వసూలు
  • రూ.7 కోట్ల మేర మోసం చేసిందంటూ ఫిర్యాదులు
  • శిల్పా చౌదరి అరెస్ట్
  • దివ్యారెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో బెయిల్

సెలబ్రిటీలను కోట్లాది రూపాయల మేర మోసం చేసిన శిల్పా చౌదరికి బెయిల్ లభించింది. అయితే, కోర్టు ఒక కేసులోనే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. మరో రెండు కేసుల్లో బెయిల్ నిరాకరించింది. దివ్యారెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో శిల్పా చౌదరికి ఉప్పర్ పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పలువురిని మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి అరెస్టవడం తెలిసిందే.

పెట్టుబడుల పేరుతో శిల్ప కొందరు ప్రముఖుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది. శిల్ప చేతిలో మోసపోయిన వారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. తమను రూ.7 కోట్ల మేర మోసగించినట్టు శిల్పా చౌదరిపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News