Allu Arjun: ఇది నా జీవితంలో గర్వించదగ్గ రోజు: అల్లు అర్జున్

Allu Arjun attends Pushpa promotion event in Mumbai
  • రేపు పుష్ప రిలీజ్
  • ముంబయిలో బన్నీ ప్రెస్ మీట్
  • తనకు ఇదే మొదటి జాతీయస్థాయి ప్రెస్ మీట్ అని వెల్లడి
  • ఇకపై పాన్ ఇండియా సినిమాలు చేస్తానని వివరణ
పుష్ప చిత్రం రేపు (డిసెంబరు 17) ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రబృందంతో కలిసి ముంబయి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ భావోద్వేగాలకు గురయ్యారు.

ముంబయిలో తనకు ఘనస్వాగతం లభించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేడు తన జీవితంలో గర్వించదగ్గ రోజు అని, ఎందుకంటే నటుడిగా మొదటిసారి జాతీయస్థాయి మీడియా సమావేశంలో పాల్గొంటున్నానని వివరించారు. తాను ఇతర భాషల్లో నేరుగా ఎప్పుడూ నటించలేదని, కానీ తన సినిమాలు వేరే భాషల్లో డబ్ అవుతుంటాయని తెలిపారు. ఆ విధంగా ఇతర భాషల్లోనూ అభిమానులను పొందగలగడం అదృష్టంగా భావిస్తానని బన్నీ చెప్పారు.

ఇకపై తన చిత్రాలు పాన్ ఇండియా సినిమాలయ్యేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. తనకు రీమేక్ లంటే భయమని, అందుకే వాటికి దూరంగా ఉంటానని అన్నారు.
Allu Arjun
Pushpa
Mumbai
Press Meet
Tollywood

More Telugu News