సమంత సినిమాలో కీలకపాత్రలో వరలక్ష్మి

15-12-2021 Wed 17:16
  • 'యశోద' సినిమాలో నటిస్తున్న సమంత
  • ఈరోజు షూటింగ్ లో జాయిన్ అయిన వరలక్ష్మి
  • థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా
Varalakshmi playing key role in Samantha movie
ఇటీవలే అక్కినేని నాగచైతన్యతో వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చిన సమంత తన పూర్తి దృష్టిని యాక్టింగ్ కెరీర్ పైనే ఫోకస్ చేసింది. ఈ క్రమంలో పలు ప్రాజెక్టులకు ఆమె సైన్ చేసింది. మరోవైపు శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న 'యశోద' సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. హరీశ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మరోవైపు ఈ చిత్రంలో ఒక ప్రధానమైన పాత్ర కోసం తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ను ఎంపిక చేశారు.

ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 6న నుంచి రెగ్యులర్ గా జరుగుతోంది. షూటింగ్ లో ఈరోజు వరలక్ష్మి జాయిన్ అయింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 23 వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. రెండో షెడ్యూల్ జనవరి 3 నుంచి ప్రారంభంకానుంది. మార్చి నాటికి షూటింగ్ పూర్తవుతుందని చిత్రం యూనిట్ తెలిపింది. థ్రిల్లర్ కథాంశంతో అందరినీ ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు.