Vijaya Sethupathi: హీరో విజయ్‌ సేతుపతితో పాటు ఆయ‌న మేనేజ‌ర్‌కు కోర్టు స‌మ‌న్లు

Vijaya Sethupathi reveives notice
  • గ‌త‌నెల‌ విమానాశ్ర‌యంలో ఘ‌ర్ష‌ణ‌
  • హీరోపై దాడికి గాంధీ అనే వ్య‌క్తి ప్ర‌య‌త్నం
  • త‌న‌పైనా దాడి జ‌రిగింద‌ని కోర్టులో గాంధీ పిటిష‌న్‌
సినీనటుడు విజయ్‌ సేతుపతిపై గ‌త‌నెల‌లో విమానాశ్ర‌యంలో దాడికి ప్ర‌య‌త్నం జ‌రిగిన వీడియో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. జాతీయ అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లిన విజయ్ సేతుప‌తి గ‌త‌నెల 2న తిరిగిరాగా, బెంగళూరు విమానాశ్ర‌యంలో ఆ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌హా గాంధీ అనే వ్య‌క్తి ఆ దాడి చేయ‌డానికి య‌త్నించాడు.

అయితే, అంత‌కుముందు జ‌రిగిన సంఘ‌ట‌న‌ను వివ‌రిస్తూ మహా గాంధీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై, సైదాపేట కోర్టు విజయ్ సేతుప‌తికి, ఆయ‌న మేనేజ‌ర్‌కు సమన్లు పంపింది. బెంగళూరు విమానాశ్ర‌యంలో విజయ్‌ని చూసి ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లగా, ఆయ‌న టీంలో ఓ వ్యక్తి తనతో అభ్యంతరకరంగా వ్యవహరించాడ‌ని మహా గాంధీ పేర్కొన్నాడు.

అంతేగాక‌, తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసినట్లు పిటిష‌న్‌లో తెలిపాడు. అందుకే విజయ్‌ టీంకు, తనకు మధ్య గొడ‌వ జ‌రిగింద‌ని చెప్పాడు. అనంతరం విమానాశ్రయం వెలుపల విజయ్‌ మేనేజర్‌ జాన్సన్ తనపై దాడి చేసినట్లు ఆయ‌న ఆరోపించాడు. ఈ నేప‌థ్యంలోనే చెన్నై కోర్టు నోటీసులు పంపింది.
Vijaya Sethupathi
Tamilnadu

More Telugu News