విశ్వసుందరిగా భారత ముద్దుగుమ్మ హర్నాజ్.. నెట్ లో జనాలు ఆమె గురించి ఏం వెతికారంటే..?
- మిస్ యూనివర్స్ గా ఎంపికైన మూడో భారతీయురాలు హర్నాజ్ కౌర్
- ఆమె ఎత్తు, వయసు గురించి ఎక్కువగా శోధించిన నెటిజెన్లు
- సుస్మిత, లారా దత్తాల గురించి కూడా వెతికిన నెటిజెన్లు
హర్నాజ్ కౌర్ సంధూ మిస్ యూనివర్స్, మిస్ యూనివర్స్ 2021, మిస్ యూనివర్స్ వంటి పదాలు గూగుల్ సర్చ్ లో టాప్ లో నిలిచాయి. దీంతో పాటు హర్నాజ్ వయసు, ఎత్తు గురించి కూడా ఎక్కువగా సర్చింగ్ జరిగింది. గతంలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న సుస్మితా సేన్, లారా దత్తాల గురించి కూడా నెటిజెన్లు శోధించారు.