దక్షిణాఫ్రికా టూర్ ముంగిట టీమిండియాకు ఎదురుదెబ్బ... గాయంతో రోహిత్ శర్మ దూరం

Injured Rohit Sharma out of South Africa tour
  • ఈ నెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్
  • ముంబయిలో టీమిండియా ప్రాక్టీసు
  • తొడ కండరాల గాయానికి గురైన రోహిత్
  • రోహిత్ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచల్ ఎంపిక
దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమవుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ నెల 26 నుంచి 2022 జనవరి 15 వరకు దక్షిణాఫ్రికాతో భారత జట్టు 3 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ కు కోహ్లీ కెప్టెన్ కాగా, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్.

అయితే, ముంబయిలో నెట్ ప్రాక్టీసు చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దాంతో అతడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు దూరమయ్యాడని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. టెస్టు జట్టులో రోహిత్ శర్మ స్థానాన్ని గుజరాత్ ఆటగాడు ప్రియాంక్ పాంచల్ తో భర్తీ చేస్తున్నామని తెలిపింది.
Go Back to Shorts
Rohit Sharma
Injury
Team India
South Africa Tour
Test Series

More Telugu News