Bollywood: కోహ్లీ ఎక్కడ.. నేనెక్కడ?.. అతడి ముందు నేను దిగదుడుపే: అమితాబ్

Amitabh Funny Post On Insta Followers Compares Him To Kohli
  • ఇన్ స్టాలో ఫాలోవర్లపై ఫన్నీ పోస్ట్
  • ఓ ఫొటో షేర్ చేసి కామెంట్
  • ఈ విషయంలో కోహ్లీనే నా కన్నా పెద్దంటూ వ్యాఖ్య
విరాట్ కోహ్లీ ముందు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దిగదుడుపేనట. ఆయనతో పోలిస్తే కోహ్లీనే ‘శక్తిమంతుడట’. అవునండీ.. ఈ మాటలన్నది స్వయానా అమితాబ్. ఈ కామెంట్స్ అన్నీ ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్ల గురించే. నిన్న ఇన్ స్టాగ్రామ్ లో బిగ్ బీ ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోకు తన పోస్టును రాసుకొచ్చారు.

‘‘ఇది ఆమె ఇచ్చింది. ఒకసారి వేసుకుని చూడమని చెప్పింది. వేసుకున్నా. ఇక మీ అందరికే వదిలేస్తున్నా. అదంతా కాదుగానీ.. అసలు నిజమేంటంటే ‘నంబర్లే’. ఈ విషయంలో 16 కోట్లకుపైన ఫాలోవర్లున్న విరాట్ కోహ్లీ ఎక్కడ? జస్ట్ 2.9 కోట్లే ఉన్న నేనెక్కడ? ఈ విషయంలో కోహ్లీనే నాకన్నా పెద్ద.. నా కన్నా శక్తిమంతుడు. అతడి ముందు నేను దిగదుడుపే’’ అని బిగ్ బీ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం కోహ్లీకి ఇన్ స్టాలో 17.2 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. అదే అమితాబ్ ను 2.92 కోట్ల మంది ఫాలో అవుతారు. 
Bollywood
Amitabh Bachchan
Virat Kohli
Instagram

More Telugu News