somasila: సోమశిల జలాశయానికి భారీగా వరద

somasila reservoir levels
షార్ట్స్‌లో చూడండి
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరి, జ‌లాశ‌యం నిండు కుండలా మారింది. ఆ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెప్పారు.

జ‌లాశ‌యంలో ప్రస్తుతం ఇన్ ఫ్లో 27,639 క్యూసెక్కులుగా ఉండ‌గా, ఔట్ ఫ్లో 36,750 క్యూసెక్కులుగా ఉంది. సోమ‌శిల‌ జలాశయ పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలుగా ఉంటుంది. ప్ర‌స్తుతం అందులో నీటి మట్టం 76.639 టీఎంసీలుగా ఉంద‌ని అధికారులు తెలిపారు. ఇటీవ‌ల ఏపీలో భారీగా వ‌ర్షాలు కురిసిన విష‌యం తెలిసిందే.
Go Back to Shorts
somasila
Andhra Pradesh
Nellore District

More Telugu News