ఎట్టకేలకు పాకిస్థాన్ చేరిన ‘బోర్డర్’ బాబు!
- అట్టారి-వాఘా సరిహద్దులో చిక్కుకుపోయిన పాకిస్థానీలు
- సరిహద్దు వద్ద జన్మించిన బిడ్డకు ‘బోర్డర్’ అని నామకరణం చేసిన దంపతులు
- ఎన్జీవో సహకారంతో ఎట్టకేలకు స్వదేశానికి
వీరిలో పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్ జిల్లాకు చెందిన నింబోదేవి-బలమ్‌రామ్ దంపతులు కూడా ఉన్నారు. అప్పటికే నిండు గర్భిణి అయిన నింబోదేవి ఈ నెల 2న సరిహద్దులో స్థానిక ప్రజల సహకారంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ బిడ్డకు వారు ‘బోర్డర్’ అని నామకరణం చేశారు.
మరోవైపు, సరిహద్దులో పాక్ ప్రజలు కొన్ని రోజులుగా చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న ఓ ఎన్జీవో వారికి అవసరమైన వీసాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు సమకూర్చింది. దీంతో వారంతా తిరిగి స్వదేశమైన పాకిస్థాన్ చేరుకోగలిగారు. అలా ‘బోర్డర్’ సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగాడు.