Jagga Reddy: హరీశ్ రావుపై జగ్గారెడ్డి సెటైర్లు

Jagga Reddy satires on Harish Rao
  • ట్రబుల్ షూటర్ హరీశ్ ట్రబుల్ లో ఉన్నారు
  • ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్మల బరిలో ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డారు
  • నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదే
టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన మంత్రి హరీశ్ రావు ట్రబుల్స్ లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్మల జగ్గారెడ్డి పోటీలో ఉండటంతో హరీశ్ రావు ఇబ్బందిపడ్డారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగడంతో... స్థానికంగా ఉన్న నేతలను హరీశ్ రావు సొంత బిడ్డలుగా, సొంత అల్లుళ్లుగా చూసుకున్నారని వ్యంగ్యంగా అన్నారు. ఏదేమైనా ఉమ్మడి మెదక్ జిల్లాలో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. టీఆర్ఎస్ మాదిరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా క్యాంపులు పెట్టలేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి 700లకు పైగా ఓట్లు ఉండి కూడా క్యాంపులు పెట్టిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ఉన్న 230 ఓట్లతో పాటు మరో 170 ఓట్లు వస్తాయని భావిస్తున్నామని చెప్పారు.
Jagga Reddy
Congress
Harish Rao
TRS

More Telugu News