China: అమెరికాకు తగిన బుద్ధి చెబుతాం.. బీజింగ్ ఒలింపిక్స్ ను బహిష్కరించడంపై చైనా వార్నింగ్

China Warning To America Over Diplomatic War On Beijing Winter Olympics
  • బహిష్కరిస్తే తమకేమీ నష్టం లేదన్న విదేశాంగ శాఖ
  • రాజకీయ లబ్ధి కోసం ఒలింపిక్స్ ను వాడుకుంటున్నారని మండిపాటు
  • ప్రపంచంలోని చాలా దేశాలు తమవైపే ఉన్నాయని కామెంట్
బీజింగ్ ఒలింపిక్స్ కు దౌత్యవేత్తలను పంపబోమని ప్రకటించి దౌత్య యుద్ధానికి అగ్రరాజ్యం అమెరికా తెరదీసింది. ఆ తర్వాత బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి మరిన్ని దేశాలూ అమెరికా బాటలోనే నడిచాయి. దీనిపై చైనా స్పందిస్తూ, అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఒలింపిక్స్ ను అమెరికా, దాని మిత్ర దేశాలు రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నాయని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ అన్నారు. ఆ తప్పునకు మూల్యం చెల్లించుకోక తప్పదని, వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
 
ఆ దేశాలు బహిష్కరించినంత మాత్రాన తమకేమీ నష్టం లేదని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు బీజింగ్ ఒలింపిక్స్ కు మద్దతుగా నిలిచాయన్నారు. కొంతమంది దేశాధినేతలు, రాజకుటుంబీకులు ఒలింపిక్స్ కు వస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటన్, కెనడా ప్రతినిధులను తాము ఆహ్వానించడం లేదని స్పష్టం చేశారు. కాగా, ఫిబ్రవరి 4న బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ మొదలుకానున్నాయి. అదేనెల 20న ముగియనున్నాయి.
China
USA
Beijing
Olympics

More Telugu News