చాన్నాళ్ల తర్వాత పక్కపక్కనే చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు... ఫొటో ఇదిగో!

10-12-2021 Fri 14:21
  • కొన్నాళ్లుగా చంద్రబాబు, దగ్గుబాటి మధ్య విభేదాలు
  • తాజాగా ఓ శుభకార్యంలో కలిసిన వైనం
  • అదే ఫొటోలో భువనేశ్వరి, పురందేశ్వరి 
  • అభిమానులను ఆకట్టుకుంటున్న ఫొటో
Chandrababu and Daggubati Venkateswara Rao seen together in function
రాజకీయ వైరుధ్యాల కారణంగా చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాన్నాళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఎన్టీఆర్ అల్లుళ్లయిన వీరిద్దరూ ప్రస్తుతం చెరో పార్టీలో ఉన్నారు. గతంలో పార్టీలో ప్రముఖ స్థానంలో ఉన్న దగ్గుబాటి మంత్రిగానూ వ్యవహరించారు. కాలక్రమంలో టీడీపీకి దూరమయ్యారు. అప్పటి నుంచి ఆయన చంద్రబాబుతో కలిసింది లేదనే చెప్పాలి.

అయితే, ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి తనయ పెళ్లి వేడుక సందర్భంగా వీరిద్దరూ కలిశారు. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. తర్వాత అటు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇటు నారా భువనేశ్వరి, పురందేశ్వరి పక్కపక్కనే నిల్చుని ఫొటోలకు పోజులిచ్చారు. పెళ్లికూతురు నలుగు కార్యక్రమంలో వీరు సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకర్షిస్తోంది.