Vijayasai Reddy: బిపిన్ రావత్ కు నివాళి అర్పించిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy pays tributes to Bipin Rawat
  • హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ సహా మరో 12 మంది మృతి 
  • జగన్ తరపున నివాళి అర్పించిన విజయసాయి రెడ్డి
  • దేశానికి రావత్ చేసిన సేవలు మరువలేనివని వ్యాఖ్య
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ బిపిన్ రావత్ కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నివాళి అర్పించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. తమ పార్టీ అధినేత జగన్ తరపున జనరల్ రావత్ దంపతుల భౌతికకాయాలకు నివాళి అర్పించానని చెప్పారు. దేశ రక్షణకు రావత్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన కుటుంబం మొత్తం దేశ సేవకే అంకితమయిందని చెప్పారు. రావత్ తండ్రి కూడా లెఫ్టినెంట్ జనరల్ గా పని చేశారని అన్నారు.

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్, ఆయన భార్య సహా 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి వీరి భౌతికకాయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ప్రధాని మోదీ సహా పలువురు నేతలు వీరి భౌతిక కాయాలకు నివాళులు అర్పించారు.
Vijayasai Reddy
Jagan
YSRCP
Bipin Rawat
CDS

More Telugu News