'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్ విడుద‌ల వేళ థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ ర‌చ్చ‌.. వీడియోలు ఇవిగో

09-12-2021 Thu 13:20
  • 108 కొబ్బ‌రికాయ‌ల చొప్పున‌ కొడుతోన్న ఫ్యాన్స్
  • అబ్బాయిల‌తో పోటీ ప‌డుతూ అమ్మాయిలూ విజిల్స్
  • క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు
  • థియేట‌ర్ల వ‌ద్ద బాణ‌సంచా కాల్చుతూ హంగామా
fans burst crackers for rrr
అభిమానులు ఉత్కంఠ‌తో ఎదురుచూస్తోన్న రాజమౌళి కొత్త సినిమా 'ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్ క‌న‌ప‌డిన తీరు అల‌రిస్తోంది. ట్రైల‌ర్ విడుద‌ల నేప‌థ్యంలో థియేట‌ర్ల వ‌ద్ద అభిమానులు చేస్తోన్న హంగామా అంతా ఇంత కాదు.

        
థియేట‌ర్ల వ‌ద్ద పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. బాణ‌సంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుతూ, డ్యాన్సులు చేస్తూ అభిమానులు ర‌చ్చ‌చేస్తున్నారు. చెర్రీ, తార‌క్ వంటి యంగ్ ఎన‌ర్జిటిక్ హీరోలు న‌టిస్తోన్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. కాగా, వ‌చ్చేనెల‌ 7వ తేదీన ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

                                                   
రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులూ తోడై థియేట‌ర్ల‌లోనే కాకుండా ప‌లు చోట్ల సంబ‌రాలు చేసుకుంటున్నారు. 108 కొబ్బ‌రికాయ‌ల చొప్పున‌ కొడుతూ కొన్ని ప్రాంతాల్లో ఫ్యాన్స్ సంద‌డి చేశారు. అమ్మాయిలు కూడా ఏ మాత్రం త‌గ్గ‌కుండా విజిల్స్ వేస్తూ కేక‌లు వేస్తూ థియేట‌ర్ల‌లో ఎంజాయ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ పోస్ట‌ర్ల‌కు అభిమానులు పాలాభిషేకం చేశారు.