Bipin Rawat: వీడియో కాల్ చేసి మాట్లాడిన గంటకే సాయితేజ మృతి.. విషాదంలో కుటుంబం

  • హెలికాప్టర్ ప్రమాదంలో రావత్‌తో పాటు మృతి
  • అంతకుముందే కుమార్తెను చూడాలంటూ వీడియో కాల్
  • కుటుంబంతో సంతోషంగా మాట్లాడిన సాయితేజ్
  • ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం
  • విషాదంలో మదనపల్లె
Sai Teja calls to his family in a video call before he died

త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన భార్య మధులిక సహా 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని నీలగిరి జిల్లా కన్నూర్ సమీపంలో కూలిన ఘటనలో 13 మంది దుర్మణం పాలవగా గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ ఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామంలోనూ విషాదం నింపింది.

గ్రామానికి చెందిన బి.సాయితేజ కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా చేరిన తర్వాత సాయితేజ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఏడాది క్రితమే ఆయన తన కుటుంబాన్ని మదనపల్లెకు మార్చారు. కాగా, నిన్న ప్రమాదం జరగడానికి ముందు సాయితేజ ఉదయం 8.15 గంటలకు భార్య శ్యామలకు వీడియో కాల్ చేశారు. కుమార్తె దర్శినిని చూడాలని ఉందని భార్యకు చెప్పారు. అనంతరం అందరితో మాట్లాడిన ఆయన ఆ తర్వాత కాసేపటికే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలిసి మదనపల్లెలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

More Telugu News