Raghu Rama Krishna Raju: పార్లమెంటులోకి వెళ్తుంటే ఎంపీ గోరంట్ల మాధవ్ నన్ను బెదిరించారు: ఎంపీ రఘురామకృష్ణరాజు

YCP MP Gorantla Madhav Warns me said Raghurama Raju
  • గోరంట్ల బెదిరింపులపై ప్రధానికి లేఖ రాశా
  • గతంలోనూ ఆయన నన్ను బెదిరించారు
  • నందిగం సురేశ్ పార్లమెంటులో నన్ను తిట్టి ఆ తర్వాత లేదంటున్నారు
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తనను బెదిరించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. బుధవారం తాను నాలుగో గేటు నుంచి పార్లమెంటులోకి ప్రవేశిస్తుంటే ఎంపీ మాధవ్ తనను దూషిస్తూ బెదిరించారని అన్నారు. గతంలో కూడా ఆయన తనను బెదిరించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అప్పట్లో సెంట్రల్ హాలులో తనను బెదిరించడంపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

పార్లమెంటులో తనను అసభ్య పదజాలంతో దూషించిన నందిగం సురేశ్ ఆ తర్వాత అలా మాట్లాడలేదని అంటున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలను అంగీకరించలేని వాళ్లు అలా ఎందుకు మాట్లాడాలని ప్రశ్నించారు. అలాగే, గోరంట్ల బెదిరింపులపై ఫిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశానని రఘురామకృష్ణ రాజు తెలిపారు.
Raghu Rama Krishna Raju
Parliament
Gorantla Madhav
Nandigam Suresh

More Telugu News