Narendra Modi: హెలికాప్టర్ కూలిన ఘటనపై ప్రధాని మోదీ అత్యవసర సమావేశం

PM Modi emergency cabinet meet on helicopter crash in Tamil Nadu
  • తమిళనాడులో కుప్పకూలిన హెలికాప్టర్
  • గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ప్రమాదం
  • హెలికాప్టర్ లో బిపిన్ రావత్ కుటుంబం
  • కాసేపట్లో పార్లమెంటులో ప్రకటన చేయనున్న రాజ్ నాథ్
తమిళనాడులో సైనిక హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ప్రమాదం వివరాలను ఆయన ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఘటనపై రాజ్ నాథ్ కొద్దిసేపట్లో పార్లమెంటులో క్లుప్తంగా ప్రకటన చేయనున్నారు. కాగా ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ కు తీవ్ర గాయాలు కాగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ఆయన అర్ధాంగి ఉన్నారని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Narendra Modi
Helicopter Crash
Tamil Nadu
Cabinet
Rajnath Singh

More Telugu News