Harish Rao: థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని క్రిటికల్ కేర్ సౌకర్యాలను బలోపేతం చేస్తున్నాం: హరీశ్ రావు

  • కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకలతో ఏర్పాటు చేసిన అంతస్తును ప్రారంభించిన హరీశ్ రావు
  • డయాలసిస్ యూనిట్ కూడా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మంత్రి
  • రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 900 ఐసీయూ పడకలను తీసుకొచ్చే పనిలో ఉన్నామని వ్యాఖ్య
Increasing Critical Care facilities in Govt hospitals says Harish Rao

హైదరాబాద్ కొండాపూర్ లో ఉన్న జిల్లా ఆసుపత్రిలో 100 పడకలతో ఏర్పాటు చేసిన మూడో అంతస్తును ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్, రియలెస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీల చొరవతో 100 పడకలను ఏర్పాటు చేశామని చెప్పారు. కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ యూనిట్ ను చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

కరోనా థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ సౌకర్యాలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రూ. 150 కోట్లతో 900 ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ప్రతిరోజు 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని చెప్పారు. టీకా వేయించుకోని వారు త్వరగా వేయించుకోవాలని కోరుతున్నానని తెలిపారు.

More Telugu News