Nani: 'శ్యామ్ సింగ రాయ్' నుంచి సిరివెన్నెల సాంగ్!

Shyam Singha Roy lyrical song released
  • నాని హీరోగా 'శ్యామ్ సింగ రాయ్'
  • కలకత్తా నేపథ్యంలో నడిచే కథ 
  • సిరివెన్నెల రాసిన చివరి పాట 
  • సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ 
  • ఈ నెల 24వ తేదీన విడుదల  
నాని - రాహూల్ సాంకృత్యన్ కాంబినేషన్లో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. చాలాకాలం క్రితం కలకత్తాలో ఆచారం పేరిట జరిగిన ఒక దురాచారం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ దురాచారాన్ని అడ్డుకునే సంస్కర్తగా నాని కనిపించనున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. క్రితం నెలలో దీపావళి పండుగ రోజున సిరివెన్నెల రాసిన చివరిపాట ఇది. 'నేలరాజునీ, ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల. దూరమా .. తీరమై చేరుమా. నడిరాతిరిలో తెరలు తెరిచినది .. నడి నిద్దురలో మగత మరిచినది .. ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కల' అంటూ ఈ పాట సాగుతోంది.

 మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. నాని - సాయిపల్లవిపై చిత్రీకరించిన ఈ పాట, సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందేమోనని అనిపిస్తోంది. కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ కూడా నాని సరసన కథానాయికలుగా మెరవనున్నారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nani
Sai Pallavi
Krithi Shetty
Madonna

More Telugu News