Kishan Reddy: కేసీఆర్ కో, టీఆర్ఎస్ కో మేము భయపడం: కిషన్ రెడ్డి

We will not afraid of KCR says Kishan Reddy
  • బాయిల్డ్ రైస్ పై టీఆర్ఎస్ ప్రభుత్వమే అగ్రిమెంట్ చేసుకుంది
  • మెడ మీద కత్తిపెట్టి సంతకం చేయించుకున్నారని కేసీఆర్ అసత్యాలు మాట్లాడుతున్నారు
  • కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
హుజూరాబాద్ ఉపఎన్నిక ఓటమిని జీర్ణించుకోలేకే ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాయిల్డ్ రైస్ పై అగ్రిమెంట్ చేసుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. మెడ మీద కత్తిపెట్టి సంతకం చేయించుకున్నారని కేసీఆర్ అసత్యాలు మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. తాము కేసీఆర్ కో, టీఆర్ఎస్ కో భయపడేవాళ్లం కాదని అన్నారు. తాము ఒకవేళ భయపడితే రైతులకే భయపడతామని చెప్పారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
Kishan Reddy
BJP
KCR
TRS

More Telugu News