'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ వాయిదా!

06-12-2021 Mon 18:48
  • కీర్తి సురేశ్ నాయికగా 'గుడ్ లక్ సఖి'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
  • ఈ నెల 31వ తేదీన విడుదల
Good Luck Sakhi movie update
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా 'గుడ్ లక్ సఖి' సినిమా రూపొందింది. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ సినిమాకి, నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగు పూర్తిచేసుకుని చాలాకాలమే అయింది. లాక్ డౌన్ పడటం .. ఆ తరువాత ఇతర సినిమాల పోటీ ఎక్కువగా ఉండటం వలన, సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తోంది.
 
గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది. అందుకు తగిన విధంగా డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఆది పినిశెట్టి ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.

కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా తాజాగా ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ  సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి..