Pushpa: విడుదల కాని 'పుష్ప' ట్రైలర్... తీవ్ర నిరాశలో అభిమానులు

Allu Arjun Pushpa trailer release delayed
  • ఈ సాయంత్రం ట్రైలర్ విడుదల చేస్తామని ఇటీవల ప్రకటన
  • సాంకేతిక కారణాలతో రిలీజ్ చేయలేకపోతున్నట్టు వెల్లడి
  • ట్వీట్ చేసిన పుష్ప యూనిట్
  • ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'పుష్ప ది రైజ్'
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ సినిమా ట్రైలర్ నేటి సాయంత్రం 6.03 గంటలకు విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో ట్రైలర్ ను రిలీజ్ చేయలేకపోతున్నామని పుష్ప యూనిట్ వెల్లడించింది.

ముందుగా ప్రకటించినట్టు 6.03 గంటలకు ట్రైలర్ ను అభిమానుల ముందుకు తీసుకురాలేకపోతున్నామని, ఆలస్యానికి మన్నించాలని కోరింది. త్వరలోనే ట్రైలర్ తో అభిమానుల ముందుకు వస్తామని పుష్ప యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కాగా, ట్రైలర్ వస్తుందని ఎంతో ఉత్సాహంతో ఎదురుచూసిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ స్పందనలను ట్వీట్ల రూపంలో కురిపించారు.

అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. 'పుష్ప ది రైజ్' పేరిట తొలి భాగం విడుదలకు ముస్తాబవుతోంది.
Pushpa
Trailer
Allu Arjun
Tollywood

More Telugu News