చంద్రబాబు వరదలను కూడా వదలడంలేదు: అంబటి

05-12-2021 Sun 20:24
  • అంబటి రాంబాబు ప్రెస్ మీట్
  • చంద్రబాబుపై విమర్శల దాడి
  • ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని వ్యాఖ్యలు
  • జగన్ ను అభాసుపాలు చేయాలనుకుంటున్నాడని ఆరోపణ
Ambati slams opposition leader Chandrababu
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు వరదలను కూడా వదలడంలేదని, వరదలతో వికృత రాజకీయ క్రీడ ఆడుతున్నాడని విమర్శించారు. వరదలను మానవతప్పిదంగా చిత్రీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, తద్వారా జగన్ ను అభాసు పాలు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.  

గత వందేళ్లలో ఎన్నడూలేనంతగా కురిసిన భారీ వర్షాల వల్లే కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ తెగిందని అన్నారు. అంతేతప్ప, అందులో మానవ తప్పిదం ఎక్కడుందని ప్రశ్నించారు. సందు దొరికితే చాలు ప్రభుత్వం పరువు తీయాలని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరిందన్నారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రజలు ఆయనపై తిరగబడలేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని వివరించారు. కొందరిని చూస్తే మొట్టబుద్ధేస్తుందని, కొందరని చూస్తే పెట్టబుద్ధేస్తుందని వ్యాఖ్యానించారు. వైఎస్ ను గానీ, జగన్ ను గానీ చూస్తే ప్రజల్లో ఎంతో సంతోషం కలుగుతుందని పేర్కొన్నారు.