Car: చిత్తూరు జిల్లాలో రోడ్డుపై కారు దగ్ధం.... ఆరుగురి దుర్మరణం

Car caught in fire as five charred to death
  • కల్వర్టును ఢీకొన్న కారు 
  •  కారులో మంటలు
  • ఐదుగురు అక్కడిక్కడే మృతి
  • మృతుల్లో చిన్నారి
  • పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై ఘటన
చిత్తూరు జిల్లాలో ఈ మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. పూతలపట్టు-నాయుడుపేట హైవేపై ఓ కారు దగ్ధమైంది. అగరాల వద్ద కారు మంటల్లో చిక్కుకుంది. వేగంగా వచ్చిన కారు ఓ కల్వర్టును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఐదుగురు సజీవ దహనం కాగా, ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. మరణించిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. మరో ఇద్దరు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. కారు నెంబరు AP39 HA 4003 అని గుర్తించారు.
Car
Fire Accident
Agarala
Chittoor District

More Telugu News