Upasana: రెండు సింహాలను దత్తత తీసుకున్న ఉపాసన

Upasana adopts two lions in Hyderabad Zoo
  • ఉపాసన తాజా నిర్ణయం
  • హైదరాబాదు జూలో లక్ష్మి, విక్కీ అనే సింహాల దత్తత
  • ఏడాది పాటు వాటి ఖర్చు భరించనున్న ఉపాసన
  • జూ పార్కు సిబ్బంది పనితీరుకు అభినందనలు
మెగా కోడలు, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన సామాజిక సేవా దృక్పథం గురించి తెలిసిందే. తాజాగా ఆమె వన్యప్రాణుల సంరక్షణ పట్ల ఆసక్తి చూపించారు. రెండు సింహాలను దత్తత తీసుకున్నారు. హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కులోని లక్ష్మి, విక్కీ అనే రెండు సింహాల సంరక్షణ బాధ్యతలను ఆమె ఏడాది పాటు స్వీకరించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు రూ.2 లక్షల చెక్కును జూ క్యూరేటర్ కు అందజేశారు.

తన సోదరితో కలిసి జూ పార్క్ ను సందర్శించిన ఉపాసన అక్కడి సిబ్బంది పనితీరును మెచ్చుకున్నారు. రెండు వేలకుపైగా ఉన్న జంతువులను బాగా చూసుకుంటున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ రాజశేఖర్ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Upasana
Lions
Adpotion
Hyderabad Zoo

More Telugu News