Cricket: అది నా కలల బంతి: హైదరాబాదీ పేసర్ సిరాజ్

This Is Siraj Dream Ball He explains
  • రాస్ టేలర్ వికెట్ పై మ్యాచ్ అనంతరం స్పందన
  • ప్రతి బౌలర్ కూ డ్రీమ్ బాలేనని కామెంట్
  • గాయం తర్వాత ఒకటే వికెట్ పెట్టుకుని సాధన చేశానన్న స్పీడ్ స్టర్
తాను సంధించే బంతుల్లో ‘ఆ బంతి’ తన కలల బంతి అని హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ ప్రధాన బ్యాటర్ అయిన రాస్ టేలర్ ను చక్కటి ఔట్ స్వింగర్ తో క్లీన్ బౌల్డ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే రెండు వికెట్లను కోల్పోయిన న్యూజిలాండ్.. రాస్ టేలర్ వికెట్ తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మ్యాచ్ రెండో రోజు ఆట అనంతరం దానిపై అక్షర్ పటేల్ తో కలిసి సిరాజ్ మాట్లాడాడు.


టేలర్ కు ఇన్ స్వింగర్ బంతులేద్దామని ఫీల్డింగ్ సెట్ చేశామని చెప్పాడు. కానీ, అదే టైంలో తన బౌలింగ్ ను బట్టి ఔట్ స్వింగర్ ఎందుకు వేయకూడదని ఆలోచించుకున్నానని, దానిని అమలు చేసి వికెట్ రాబట్టానని చెప్పాడు. తనతో పాటు ప్రతి బౌలర్ కూ అది కలల బంతి అని అన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక ఎలా సాధన చేసిందీ వివరించాడు. సాధనలో భాగంగా ఒకటే వికెట్ పెట్టుకుని.. వీలైనంత మేరకు స్వింగ్ రాబట్టడానికి కృషి చేశానన్నాడు. అదే తనకు బాగా ఉపయోగపడిందని చెప్పాడు.
Cricket
Team New Zealand
Team India
Mohammed Siraj

More Telugu News