Rapido: ఆర్టీసీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వాణిజ్య ప్రకటనలు నిలిపివేయాలంటూ ర్యాపిడోను ఆదేశించిన కోర్టు

Court orders Rapido on controversial ads
  • దేశంలో బైక్ ట్యాక్సీ సేవలు అందిస్తున్న ర్యాపిడో
  • తెలుగులో అల్లు అర్జున్ తో యాడ్
  • ఆర్టీసీ సేవలను తక్కువ చేసి చూపించారంటూ ఆరోపణలు
  • కోర్టును ఆశ్రయించిన ఆర్టీసీ
బైక్ ట్యాక్సీలతో దేశంలో వినూత్న తరహా సేవలు అందిస్తున్న ర్యాపిడో సంస్థకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ర్యాపిడో వాణిజ్య ప్రకటనల్లో ఆర్టీసీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చూపించారంటూ తెలంగాణ ఆర్టీసీ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ర్యాపిడో యాడ్ లో తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్ఠను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించింది.

దీనిపై విచారణ జరిపిన కోర్టు... సదరు యాడ్ లను నిలిపివేయాలంటూ ర్యాపిడోను ఆదేశించింది. అంతేకాదు, యూట్యూబ్ లోనూ ర్యాపిడో యాడ్ లు ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

ర్యాపిడో తెలుగు యాడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కంటే ర్యాపిడో మేలు అనే రీతిలో ఆ యాడ్ రూపొందించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆర్టీసీ ఇప్పటికే ర్యాపిడో సంస్థకు, అల్లు అర్జున్ కు నోటీసులు పంపింది.
Rapido
Court
Ads
Allu Arjun
TSRTC
Telangana

More Telugu News