Shilpa Chowdary: పోలీసు విచారణలో ఇద్దరి పేర్లు వెల్లడించిన శిల్పా చౌదరి

Shilpa Chowdary reveals two names in police custody
  • సెలబ్రిటీలను మోసం చేసినట్టు శిల్పా చౌదరిపై ఆరోపణలు
  • రెండ్రోజులుగా పోలీసు విచారణ
  • రాధికారెడ్డికి రూ.6 కోట్లు ఇచ్చానన్న శిల్పా చౌదరి
  • తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదంటున్న రాధికారెడ్డి
సెలబ్రిటీలను కోట్లాది రూపాయల మేర మోసం చేసిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి రెండ్రోజుల కస్టడీ నిన్నటితో ముగిసింది. విచారణ సందర్భంగా ఆమె ఇద్దరి పేర్లు వెల్లడించింది. వారిలో ఒకరు శంకరంపల్లికి చెందిన రాధికారెడ్డి అని, ఆమెకు రూ.6 కోట్లు ఇచ్చానని శిల్పా చౌదరి పోలీసులకు తెలిపింది. అయితే రాధికారెడ్డి దీనిపై స్పందిస్తూ, తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మాదాపూర్ ఏసీపీని కలిసిన ఆమె, అనవసరంగా తన పేరును ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా శిల్పా చౌదరి పోలీసు విచారణలో రాధికారెడ్డి, మరొకరి పేరును ప్రస్తావించడంతో వారిద్దరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం నాడు విచారణకు రావాలని పేర్కొన్నారు. రెండో రోజు విచారణలో శిల్పా చౌదరి వెల్లడించిన మేరకు పోలీసులు గండిపేటలోని ఆమె నివాసంలో సోదాలు చేశారు. నాలుగు బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వాటిలో రెండు ఖాతాల్లో నగదు లేదని తెలుసుకున్నారు. మరో రెండు ఖాతాలను స్తంభింపచేశారు.
Shilpa Chowdary
Police Custody
Cheating
Radhika Reddy
Hyderabad

More Telugu News