Pakistan: పాకిస్థాన్ కు 3 బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసిన సౌదీ అరేబియా

  • కొన్నాళ్లుగా పతనం దిశగా పాక్ ఆర్థిక వ్యవస్థ
  • రుణాలతోనే నెట్టుకొస్తున్న వైనం
  • ఆపన్న హస్తం అందించిన సౌదీ అరేబియా
  • సౌదీ యువరాజుకు కృతజ్ఞతలు తెలిపిన పాక్ ప్రభుత్వం
Saudi Arabia grants loan for Pakistan

కొన్నాళ్లుగా పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి పతనం దిశగా పయనిస్తోంది. విదేశాల నుంచి తీసుకునే రుణాలే ఆసరాగా మారాయి. తాజాగా పాకిస్థాన్... సౌదీ అరేబియా నుంచి 3 బిలియన్ డాలర్ల మేర రుణం అందుకుంది. ఆర్థిక మద్దతు ఇచ్చే చర్యల్లో భాగంగా సౌదీ అరేబియా నుంచి ఈ రుణం మంజూరైందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు షౌకత్ తరీన్ వెల్లడించారు. పాక్ పట్ల ఉదారంగా స్పందించినందుకు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో పాక్ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడం, విదేశీ మారకద్రవ్య నిల్వలు తరిగిపోవడం, ద్రవ్య ఖాతాల లోటు మరింత విస్తరించడం, పాక్ రూపీ విలువ మరింత దిగజారడం పాక్ ను కుదేలు చేశాయి. ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద 2,22,498 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం మాత్రమే మిగిలుంది.

More Telugu News