సిరివెన్నెల చివరి పాట ఇదేనట!

04-12-2021 Sat 20:02
  • నాని నుంచి 'శ్యామ్ సింగ రాయ్'
  • సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ 
  • రెండు పాటలు రాసిన సిరివెన్నెల 
  • ఈ నెల 24న సినిమా విడుదల   
Siri Vennela song will release on December 7th
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రూపొందించాడు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'సిరివెన్నెల' అనే పాటను, ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు.

అందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వీడియోను కొంతసేపటిక్రితం వదిలారు. నాని .. రాహుల్ సాంకృత్యన్ ఈ వీడియోలో మాట్లాడారు. ఇది సిరివెన్నెల రాసిన చివరి పాట అని చెప్పారు. నవంబర్ 4వ తేదీన ఆయన ఈ పాటను రాశారని అన్నారు. ఈ పాటలో సిరివెన్నెల అంటూ ఆయన పేరు వస్తుంది.

ఆ విషయాన్ని గురించి రాహుల్ సాంకృత్యన్ ని అడిగితే, అదే తన చివరి పాట కావొచ్చని సిరివెన్నెల అన్నారట. 'నెల రాజునీ .. ఇలా రాణిని కలిపింది కదా సిరివెన్నెల' అంటూ ఈ పాట సాగుతోంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. 7వ తేదీన పూర్తి పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.