క్రిప్టో మార్కెట్ పైనా ఒమిక్రాన్ నీలి నీడలు

04-12-2021 Sat 17:13
  • ఆందోళన కలిగిస్తున్న కరోనా కొత్త వేరియంట్
  • 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయిన క్రిప్టో మదుపరులు
  • 11 శాతం పతనమైన బిట్ కాయిన్ విలువ
  • 17.4 శాతం పడిపోయిన ఈథర్ విలువ
Omicron affect on Crypto market
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బెంబేలెత్తిపోతుండడం తెలిసిందే. స్టాక్ మార్కెట్లపైనే కాదు, క్రిప్టో కరెన్సీ విపణిపైనా ఒమిక్రాన్ నీలినీడలు పరుచుకుంటున్నాయి. ఒమిక్రాన్ భయాందోళనలతో ఈ ఒక్కరోజే క్రిప్టో మదుపరులు 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయారు.

ప్రధానంగా బిట్ కాయిన్ విలువ బాగా పడిపోయింది. బిట్ కాయిన్ విలువ ఒక్కరోజే 11 శాతం పతనమై, 42,296 డాలర్లకు పడిపోయింది. మరో క్రిప్టోకరెన్సీ ఈథర్ పైనా ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. ఈథర్ విలువ 17.4 శాతం పడిపోయింది. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత ఎలా ఉండబోతోందన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోవడంతో, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అనిశ్చితి నెలకొంది.