ప్రభాస్ కొత్త చిత్రం కోసం హైదరాబాద్ వచ్చిన దీపిక పదుకొణే

04-12-2021 Sat 16:39
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ
  • హీరోయిన్ గా దీపిక పదుకొణే 
  • హైదరాబాదులో షూటింగ్
  • కీలకపాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్
Deepika Padukone arrives Hyderabad for Prabhas new movie shooting
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాలభామ దీపిక పదుకొణే నటిస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరగనుంది. చిత్రీకరణలో పాల్గొనేందుకు దీపిక నేడు నగరానికి చేరుకుంది. ఆమెకు స్వాగతం పలుకుతూ చిత్రబృందం సోషల్ మీడియాలో స్పందించింది. రాణి గారికి స్వాగతం అంటూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది.

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంగా ఆధారంగా తెరకెక్కుతోంది. దీంట్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ప్రస్తుతానికి 'ప్రాజెక్ట్-కె' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. సినిమా టైటిల్ ను తర్వాత ప్రకటించనున్నారు.