'కొన్ని మిలియ‌న్ల ఏళ్ల త‌ర్వాత‌ నిహారిక ఇలా ఉంటుంది' అని ఫొటో పోస్ట్ చేసిన భ‌ర్త చైత‌న్య‌

  • ఈ నెల‌ 9న త‌న ఫ‌స్ట్ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ
  • భ‌ర్త  చైత‌న్య‌తో క‌లిసి స్పెయిన్‌కి నిహారిక‌
  • రెస్టారెంటుకు వెళ్లి మొబైల్ ఫోనులో బిజీ
  • ఎప్పుడూ అదే ప‌ని చేస్తోంద‌న్న భ‌ర్త చైత‌న్య
Niharika husband shares her pic

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు నిహారిక  ఈ నెల‌ 9న త‌న ఫ‌స్ట్ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీని జ‌రుపుకోనుంది. అందుకోసం భ‌ర్త చైత‌న్య‌తో క‌లిసి స్పెయిన్‌కి వెళ్లింది. ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో వారు ఎంజాయ్ చేస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు. నిహారిక‌తో క‌లిసి చైత‌న్య‌ డిన్నర్‌ చేయడానికి రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడ ఓ ఫొటో తీశాడు.

రెస్టారెంటులో ఆహారం తినకుండా నిహారిక‌ తన ఫోన్‌నే చూస్తూ గ‌డుపుతోంది. దీంతో ఆమెకు తెలియ‌కుండా చైత‌న్య ఆ ఫొటో తీశాడు. త‌న భార్య ఎల్ల‌ప్పుడూ ఇదే పని చేస్తుంద‌ని చెప్పాడు. ప్రతి క్షణం ఫోన్‌లో ఇలా బిజీగా ఉంటుందని వివ‌రించాడు. 'కొన్ని మిలియ‌న్ల ఏళ్ల త‌ర్వాత‌ కూడా నిహారిక ఇలా ఉంటుంది' అని మ‌రో ఫొటో పోస్ట్ చేశాడు. అందులోనూ మొబైల్ చూడ‌డాన్ని కొన‌సాగిస్తున్న‌ట్లు నిహారిక క‌న‌ప‌డుతోంది. చైత‌న్య పోస్ట్ చేసిన ఈ ఫొటో అభిమానుల‌ను అల‌రిస్తోంది.            

         

More Telugu News