రోశయ్యతో గత స్మృతులను గుర్తు చేసుకున్న కేటీఆర్.. పలు ఫొటోలు పోస్ట్

04-12-2021 Sat 12:03
  • రోశయ్య మరణం బాధాకరమన్న తెలంగాణ మంత్రి
  • మృతిపై సంతాపం
  • కుటుంబసభ్యులకు సానుభూతి
KTR Recollects Old Memories With Roshaish
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయనతో ఉన్న గత స్మృతులను నెమరు వేసుకుంటూ పలు ఫొటోలను షేర్ చేశారు. ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మరణం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.

ఇవాళ ఉదయం బీపీ పడిపోవడంతో రోశయ్య ఇంట్లో కుప్పకూలిపోయారు. ఇంటి నుంచి ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గంమధ్యలోనే కన్నుమూశారు.