'లక్ష్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం!

04-12-2021 Sat 11:20
  • నాగశౌర్య హీరోగా 'లక్ష్య'
  • విలువిద్య నేపథ్యంలో సాగే కథ 
  • దర్శకుడిగా సంతోష్ పరిచయం 
  • ఈ నెల 10వ తేదీన విడుదల   
Lakshya movie upadate
నాగశౌర్య హీరోగా ప్రేక్షకులను పలకరించడానికి మరో సినిమా రెడీ అవుతోంది. విలువిద్య నేపథ్యంలో సాగే ఆ సినిమానే 'లక్ష్య'. నారాయణ దాస్ నారంగ్ ..  రామ్మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో 'మీట్ లక్ష్య' పేరుతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్  - గచ్చిబౌలి .. శరత్ సిటీమాల్ (ఎ ఎమ్ బి)లో ఈ వేడుక జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. విలువిద్యలో విజయాన్ని సాధించాలనే హీరో ఆశయం వెనుక ఈ కథ పరిగెడుతుంది. కేతిక శర్మ కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించాడు. 'వరుడు కావలెను' తరువాత వస్తున్న ఈ సినిమా అయినా, నాగశౌర్యకి హిట్ ఇస్తుందేమో చూడాలి.