కాసేపట్లో సీఎం కేసీఆర్ కీల‌క స‌మావేశం

04-12-2021 Sat 10:22
  • ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అత్యున్నత సమావేశం
  • హాజరుకానున్న టీఆర్ఎస్ ఎంపీలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు
  • ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
KCR to chair key meeting
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్ లో ఆయన ఈరోజు అత్యున్నత స్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, టీఆర్ఎస్ ఎంపీలు హాజరుకానున్నారు.

ధాన్యం కొనుగోళ్లపై స్పష్టతను ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేయనున్నారు.