బ్రిటన్ లో అంతకంతకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.... ఓ స్కూల్లోనూ కొత్త వేరియంట్ కలకలం

03-12-2021 Fri 21:15
  • ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఒమిక్రాన్
  • 30కి పైగా మ్యుటేషన్లతో కరోనా కొత్త వేరియంట్
  • ఇంగ్లండ్ లో 29, స్కాట్లాండ్ లో 29 కేసులు
  • నిబంధనలు కఠినతరం చేసిన బ్రిటన్
Omicron spreads faster in Britain
ఆఫ్రికా దేశాల్లో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్ లోనూ కలకలం రేపుతోంది. బ్రిటన్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కొన్నిరోజుల వ్యవధిలోనే కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు మూడు రెట్లు పెరిగాయి. ఇప్పటివరకు ఇంగ్లండ్ లో 29 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అటు స్కాట్లాండ్ లోనూ 29 కేసులు నమోదయ్యాయి.

నరీన్ ప్రాంతంలోని రోజ్ బాంక్ ప్రైమరీ స్కూల్లో ఓ విద్యార్థికి ఒమిక్రాన్ పాజిటివ్ రావడం బ్రిటన్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ లో కొత్త నియమావళి రూపొందించారు. ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తిని ఎవరైనా కలిస్తే వారికి 10 రోజుల ఐసోలేషన్ విధించారు. వారు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఐసోలేషన్ తప్పనిసరి చేశారు.