ఒమిక్రాన్ భయాలు.. కుప్పకూలిన మార్కెట్లు

03-12-2021 Fri 16:37
  • 764 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 204 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా నష్టపోయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్ విలువ
Markets ends in losses
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లో అడుగుపెట్టిందనే భయాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 764 పాయింట్లు కోల్పోయి 57,696కి పడిపోయింది. నిఫ్టీ 204 పాయింట్లు కోల్పోయి 17,196కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (0.72%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.61%), టాటా స్టీల్ (0.47%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.35%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-4.03%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.05%), ఏసియన్ పెయింట్స్ (-2.29%), భారతి ఎయిర్ టెల్ (-1.88%), టెక్ మహీంద్రా (-1.81%).