'మౌంటెన్ డ్యూ' బ్రాండ్ అంబాసిడర్ గా మహేశ్ బాబు

03-12-2021 Fri 16:24
  • మహేశ్ బాబు ఖాతాలో మరో డీల్
  • మౌంటెన్ డ్యూ ప్రచారకర్తగా నియామకం
  • ఇప్పటికే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా మహేశ్ బాబు
Mahesh Babu appointed as Mountain Dew brand ambassador
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అటు సినిమాలతోనే కాకుండా ఇటు వాణిజ్య ప్రకటనల్లోనూ అలరిస్తుంటారు. ఇప్పటికే పలు ఫేమస్ బ్రాండ్లకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన ప్రముఖ శీతలపానీయాల బ్రాండ్ 'మౌంటెన్ డ్యూ' డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన బహుళజాతి శీతలపానీయాల సంస్థ పెప్సీ కో ఉత్పాదనల్లో మౌంటెన్ డ్యూ డ్రింక్ కూడా ఒకటి. ఇది పలు దేశాల్లో ప్రాచుర్యం పొందింది.