'రీసౌండింగ్ సక్సెస్ సాధించిన బాలా బాబాయ్' అంటూ తారక్ చేసిన ట్వీట్ వైరల్!

03-12-2021 Fri 11:15
  • ఘన విజయం సాధించిన 'అఖండ' చిత్రం
  • సినిమా చూశానన్న తారక్
  • ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి సినిమాలో చాలా ఉన్నాయని వ్యాఖ్య
Junior NTR response on Balakrishna Akhanda movie
భారీ అంచనాలతో విడుదలైన బాలయ్య చిత్రం 'అఖండ' బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కరోనా మహమ్మారితో డీలా పడిపోయిన టాలీవుడ్ కు ఈ సినిమా సాధించిన ఘన విజయం... ఓ బూస్టర్ డోస్ లా పని చేస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలకు ఈ సినిమా సాధించిన గ్రాండ్ విక్టరీ ఒక ధైర్యాన్ని ఇస్తోంది. 'సింహ', 'లెజెండ్' తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' చిత్రం ఘన విజయం సాధించడంతో... వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టినట్టయింది.

మరోవైపు ఈ చిత్రం సూపర్ హిట్ కావడంపై జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తన బాబాయ్ గురించి తారక్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఇప్పుడే 'అఖండ' చూశాను. రీసౌండింగ్ సక్సెస్ సాధించిన బాలా బాబాయ్ కి, మొత్తం టీమ్ కు కంగ్రాట్స్. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి ఈ సినిమాలో చాలా ఉన్నాయ్' అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో తారక్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించారు.